Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పిల్లికి ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు.. ఇన్‌స్టాగ్రాంలో సెల‌బ్రిటీగా మారిన చైనా మార్జాలం!

ప్ర‌పంచంలో అత్యంత బాధాకారంగా ఉండే పిల్లి ఏదో తెలుసా?... చైనాలో నివ‌సించే లుహూ. దీని బాధాత‌ప్త‌మైన హావ‌భావాలే దీనికి ఇన్‌స్టాగ్రాంలో 1,42,000కి పైగా మంది ఫాలోవ‌ర్లని తెచ్చిపెట్టాయి. ఎప్పుడూ బాధప‌డుతున్న‌ట్లు క‌నిపించ‌డ‌మే దీని ప్రత్యేక‌త‌. దీని క‌ళ్లు చూస్తే ఎవ‌రికైనా `అయ్యో` అనిపిస్తుంది. దాని క‌ళ్లు ఇలా ఉండ‌టానికి కార‌ణాల‌ను లుహూ య‌జమాని మ్యాగీ లియూ వివ‌రించింది.

`లుహూకి రెండు వారాల వ‌య‌సున్న‌పుడు దాని క‌ళ్ల‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకింది. అప్ప‌ట్నుంచి దాని క‌ళ్లు అలా మారిపోయాయి. ఏదైనా చూడాల‌నుకున్న‌పుడు లుహూ క‌ళ్ల‌ను చాలా ఇబ్బందిగా వెడ‌ల్పు చేస్తుంది. అందుకే ఎప్పుడూ ఏదో బాధ‌లో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తుంది. నిజానికి అది చాలా యాక్టివ్‌` అని లియూ చెప్పింది. 2012లో త‌న స్నేహితురాలి ద‌గ్గ‌రి నుంచి లుహూని తీసుకువ‌చ్చిన‌ట్లు లియూ తెలిపింది. లుహూకి ఇంత సెల‌బ్రిటీ స్టేట‌స్ వ‌స్తుంద‌ని అప్ప‌ట్లో తాను ఊహించ‌లేద‌ని లియూ చెప్పింది.
cat
luhu
instagram celebrity
saddest cat
china cat
maggie liu

More Telugu News